అర్ధాంతరంగా నిలిచిపోయిన విమానం..శంషాబాద్లో ప్రయాణికుల ఆందోళన

అర్ధాంతరంగా నిలిచిపోయిన విమానం..శంషాబాద్లో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన వీఎన్-984 విమానం శనివారం రాత్రి వరకూ టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎయిర్​లైన్‌‌‌‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో కొందరు ప్రయాణికులు ప్రయాణాన్ని రద్దు చేసుకొని ఇంటికి వెళ్లిపోగా, మరికొంత మంది ప్రయాణికులను శనివారం అర్ధరాత్రి వరకు విమానం రెడీ చేసి పంపించనున్నట్లు తెలిపారు.